Nominations | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల కోసం రామచంద్రయ్య, హరిప్రసాద్ నామినేషన్లు
Nominations | ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలకు మంగళవారం కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల (MLCs) ఎన్నికలకు మంగళవారం కూటమి అభ్యర్థులు నామినేషన్లు (Nominations) దాఖలు చేశారు. టీడీపీ తరుఫున, మాజీ మంత్రి రామచంద్రయ్య (Ramachandraiah), జనసేన తరుఫున హరిప్రసాద్ (Hari prasad) నామినేషన్లు వేశారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వీరిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయగా రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. దీంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 12న ఉప ఎన్నిక జరుగనుంది.
జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి. హరిప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. శాసనసభలో ఎన్డీయే కూటమికి ఉన్న సంఖ్యాబలం చూస్తే ఎమ్మెల్సీలగా వారిద్దరు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనమేనని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

