RGV | ‘తల నరికితే రూ. కోటి’.. ఏపీ డీజీపీకి ఆర్జీవీ ఫిర్యాదు
RGV | ఓ టీవీ చానెల్ డిబేట్లో పబ్లిక్‌గా తన తలకు కోటి రూపాయలు వెల కట్టారని, ఇలాంటి హత్యా రాజకీయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ( Ram Gopal Varma) ఆంధ్రప్రదేశ్ డీజీపీ(AP DGP) రాజేంద్రనాథ్‌రెడ్డికి బుధవారం ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ : ఓ టీవీ చానెల్ డిబేట్లో పబ్లిక్‌గా తన తలకు కోటి రూపాయలు వెల కట్టారని, ఇలాంటి హత్యా రాజకీయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ( Ram Gopal Varma) ఆంధ్రప్రదేశ్ డీజీపీ(AP DGP) రాజేంద్రనాథ్‌రెడ్డికి బుధవారం ఫిర్యాదు చేశారు. ‘వ్యూహం’ (Vyuham) సినిమా నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌తో కలిసి టీడీపీకి చెందిన కొలికిపూడి శ్రీనివాస్, ఓ టీవీ యాంకర్ సాంబశివరావు, దాని యజమాని బీఆర్ నాయుడుపై ఫిర్యాదు చేశారు.
మంగళవారం రాత్రి ఓ టీవీ డిబేట్(TV Debet) లో పాల్గొన్న కొలికిపూడి శ్రీనివాస్ తనను చంపితే కోటి రూపాయలు ఇస్తానని చెప్పినట్లు ఆర్జీవీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనను చంపేందుకు ఎవరూ సుఫారీ ఇవ్వలేదని, మొదటిసారి ఇలాంటి వార్తలు రావడం తనను కలవరపెట్టిందని అన్నారు. ఇలాంటి హత్యారాజకీయాలను వెంటనే నివారించాలని డీజీపీని కోరారు.
‘వ్యూహం’ అనే సినిమా తన మదిలోంచి వచ్చిన ఒక పొలిటికల్ కాన్సెప్ట్ అని, ఏ తప్పు చేయనప్పుడు వారెందుకు భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హత్యా కాంట్రాక్ట్‌లు పబ్లిక్‌గా ఇవ్వడం చూస్తే, టెర్రరిస్టులు సైతం షాక్ అవుతారని ఆర్జీవీ వెల్లడించారు. ఆర్జీవీ ఫిర్యాదు మేరకు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పినట్లు నిర్మాత కిరణ్‌కుమార్ తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గ్రామ స్వరాజ్యానికి గ్రహణం.. ఆర్థికంగా కుదేలైన తెలంగాణ పంచాయతీలు.. ఆర్బీఐ నివేదికలో జీపీల దుస్థితి బట్టబయలు
Hyderabad Drinking Water | తెలంగాణ గర్భశోకం.. హైదరాబాద్ సిటీకి జల గండం
Land Resurvey | ప్రతి రైతుభూమీ రీ సర్వే.. అన్నదాతలపై రేవంత్ ప్రభుత్వం మరో కుంపటి
Private School Business | నంబర్-1 నేత కూతురి ‘మైండ్వాల్ట్’.. నంబర్- 2 నేత కుమార్తె ‘మావ్ ఎడ్యూ’.. స్కూళ్ల వ్యాపారం
KLSR Infratech | దివాలా కంపెనీ.. 6వేల కోట్ల బినామీ వైభవం.. రాష్ట్రంలోని కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టులన్నీ కేఎల్ఎస్ఆర్కే!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

