అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో పోలీసు వాహనం బ్రేకులు ఫెయిల్ అయి బోల్తాపడిన ఘటనలో ఓ కానిస్టేబుల్ దుర్మరణం ( Constable Died) చెందాడు. ఓ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి కొండకరకం వెళ్తున్న ఎస్సై అశోక్ కుమార్, కానిస్టేబుళ్లు వెంకటరమణ, నాగేంద్ర, డ్రైవర్ రాజాబాబు పోలీసు వాహనం కొండకరకం వద్ద బ్రేకులు ఫెయిల్ అయి అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న వారందరూ గాయపడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకట రమణ (49) అనే కానిస్టేబుల్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.