రామగిరిలో సునీతను అడ్డుకున్న పోలీసులు
మాజీ మంత్రి పరిటాల సునీతను పోలీసులు అడ్డుకున్నారు. పుట్టపర్తి వెళ్లకుండా ఆమె కారును రామగిరిలో పోలీసులు నిలిపివేశారు. పరిటాల సునీతతోపాటు ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్...
సత్యసాయి జిల్లా : మాజీ మంత్రి పరిటాల సునీతను పోలీసులు అడ్డుకున్నారు. పుట్టపర్తి వెళ్లకుండా ఆమె కారును రామగిరిలో పోలీసులు నిలిపివేశారు. పరిటాల సునీతతోపాటు ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ పుట్టపర్తికి వెళ్లేది లేదని అడ్డగించారు. రైతు సమస్యలపై కలెక్టరేట్ ముట్టడికి టీడీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు వారు పలువురు టీడీపీ నాయకులతో కలిసి పుట్టపర్తి వెళ్తున్నారు. అయితే వీరిని మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. పుట్టపర్తి వెళ్లనీయకుండా తమను అడ్డుకోవడంపై పరిటాల సునీత పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుసమస్యలపై నిరసన వ్యక్తం చేసేందుకు వెళుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని సునీత పోలీసులను సూటిగా ప్రశ్నించారు. అయితే పరిటాల శ్రీరామ్, పరిటాల సునీతలు కలసి ఒకే వాహనంలో వెళ్లేందుకు అనుమతిస్తామని, కాన్వాయ్‌ను అనుమతించబోమని పోలీసులు స్పష్టంచేశారు. ఒక వాహనం వెళ్లేందుకే అనుమతి ఉన్నదని పోలీసులు తెలిపారు. ఇదేమైనా నియంత రాజ్యమా అంటూ పోలీసులపై సునీత మండిపడ్డారు. పోలీసులు అడ్డుకున్న వినకుండా సునీత, శ్రీరామ్ బారికేడ్లు దాటుకుని ముందుకు వెళ్లారు.
ఇలాఉండగా, అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరిని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే పోలీసులను పెట్టి అణచివేయాలని చూడటం చాలా దుర్మార్గమన్నారు. టీడీపీ పిలుపు మేరకు రెండు జిల్లాల కలెక్టరేట్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కలెక్టరేట్ వైపు వాహనాలు వెళ్లకుండా చూశారు. కలెక్టరేట్ దారులన్నింటినీ బారికేడ్లతో మూసివేశారు. కలెక్టరేట్లలోకి వెళ్లే వారిని తనిఖీ చేసి పోలీసులు మరీ పంపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thaman | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాధేశ్యామ్’ నేపథ్య సంగీతం విడుదలకు తమన్ ప్లాన్!
Repolling Demand | పులివెందులలో రీపోలింగ్ జరిపించాలి..వైఎస్ జగన్ డిమాండ్
India vs New Zealand | సిరీస్‌లో మొదటిసారి టాస్ గెలిచిన న్యూజిలాండ్..! భారత్ బ్యాటింగ్
Eluru Ganganamma | ఏలూరు గంగానమ్మ ఆంథెమ్.. యూట్యూబ్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న భక్తి గీతం!
Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

