ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తాం : కర్నూల్ ఎస్పీ
నోటీసులు జారీ చేస్తాం | ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై నమోదైన కేసు విషయంలో ఆయనకు నోటీసులు జారీ చేస్తామని ఆ జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై నమోదైన కేసు విషయంలో ఆయనకు నోటీసులు జారీ చేస్తామని ఆ జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు అనంతరం చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కరోనా మ్యుటేషన్ ఎన్440కే వైరస్ ఉందంటూ చంద్రబాబు ప్రజలను భ్రయబ్రాంతులకు గురిచేశారని ఆయనపై ఫిర్యాదు అందిందని తెలిపారు.
న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. ఫిర్యాదును అనుసరించి చంద్రబాబుపై ఐపీసీ 155, 505(1)(బీ)(2) సెక్షన్ల కింద అదేవిధంగా 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టం సెక్షన్-4 కింద కేసు నమోదు చేశామని చెప్పారు.
కాగా.. ఐదు రోజులక్రితం టీడీపీ ముఖ్య నేతలతో ఆన్లైన్ ద్వారా సమావేశమైన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఏపీలో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ఇతర వైరస్ల కంటే అత్యంత ప్రమాదకరమైందన్నారు. వైరస్ కొత్త మ్యుటేషన్ ఎన్ 440కే ఏపీలో వ్యాపించిందని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

