Kotam Reddy | ఏపీలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు.. ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు..
Kotam Reddy | ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. రోజురోజుకీ వివాదం పెరుగుతుండటంతో ఏపీ సీఎం జగన్ దీనిపై దృష్టి సారించారు.
Kotam Reddy | ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. రోజురోజుకీ వివాదం పెరుగుతుండటంతో ఏపీ సీఎం జగన్ దీనిపై దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుతో సమావేశమై కోటం రెడ్డి అంశంపై చర్చించారు. నెల్లూరు గ్రామీణ ఇన్చార్జి బాధ్యతల నుంచి కోటంరెడ్డిని తప్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అసలేం జరిగింది?
ఆనం రామనారాయణరెడ్డి వైసీపీపై విమర్శలు చేస్తుండగా.. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనిని ముందు నుంచి అధికార వైసీపీ పార్టీ నేతలు ఖండిస్తూనే ఉన్నారు. కోటంరెడ్డి చేసిన ఆరోపణలను కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఖండించారు. పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు కోటంరెడ్డి ఆరోపణలు వెతుక్కుంటున్నారని ఆరోపించారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాలు విసిరారు. దీంతో బుధవారం మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పలు విషయాలు చెప్పుకొచ్చాడు.
పార్టీ గురించి ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడలేదని కోటంరెడ్డి స్పష్టం చేశాడు. తన ఫోన్ ట్యాప్ అవుతుందని నాలుగు నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి చెప్పారని అన్నారు. అయితే జగన్‌పై కోపంతో అబద్దం చెప్పాడని అనుకున్నానని తెలిపాడు. 20 రోజుల కిందట తన ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారం దొరికిందని చెప్పాడు. ఏపీ సీఎం జగన్ గానీ.. సజ్జల గానీ చెప్పకుండా తన ఫోన్ ట్యాప్ చేయరని.. అనుమానాలు ఉన్న చోట తాను ఉండాల్సిన అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ నిజమని తెలిసి చాలా మనస్తాపం చెందానని తెలిపారు.. తన దగ్గర ఉన్న ఆధారాలు బయటపడితే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పారు.
బాలినేని వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని.. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని బాలినేని చేసిన వ్యాఖ్యలపై కోటంరెడ్డి మండిపడ్డారు. అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎలా ఉంటుంది? సజ్జల, విజయసాయిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది? మీరు పొరపాటు చేసి ట్యాపింగ్ జరగలేదని అబద్ధాలు చెబుతారా అని కోటం రెడ్డి మండిపడ్డారు. ‘ కొద్దిరోజుల క్రితం నా చిన్ననాటి స్నేహితుడితో ఐఫోన్లో మాట్లాడా. ఆ విషయాల గురించి ఇంటెలిజెన్స్ చీఫ్ ఓ ఆడియో క్లిప్ పంపించాడు. ట్యాపింగ్ చేశారు అనడానికి ఇంతకుమించి ఆధారాలు ఏం కావాలి?’ అని ప్రశ్నించారు. ఈ ఫోన్ల ట్యాపింగ్ తను ఒక్కడితో ఆగదని ఐఏఎస్‌లు, ఏపీఎస్‌లు, జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారని ఆరోపించారు. నేను ట్యాపింగ్ అంటున్నా.. కాదంటే మీరే నిరూపించండి.. దీనిపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇంత జరిగాక తనకు వైసీపీ నుంచి పోటీ చేయాలని ఇంట్రెస్ట్ లేదని స్పష్టం చేశారు. టీడీపీ నుంచి పోటీ చేయాలని ఉందని.. దీనిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
Read More ;
తిరుమల నూతన పరకామణి భవనంలో కానుకల లెక్కింపు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

