Pawan Kalyan | ఎంపీడీవోను పరామర్శించిన పవన్ కల్యాణ్.. వైసీపీ నాయకుల తోలు తీస్తామని హెచ్చరిక
Pawan Kalyan | ఏపీలోని అన్నమయ్య జిల్లా గాలివీడులో వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఎంపీడీవో జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శనివారం పరామర్శించారు.
అమరావతి : ఏపీలోని అన్నమయ్య (Annamaiah) జిల్లా గాలివీడులో వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఎంపీడీవో జవహర్‌బాబును (MPDO Jawarbabu) డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ( Pawankalyan ) శనివారం పరామర్శించారు. విజయవాడ నుంచి నేరుగా కడప జిల్లాకు వెళ్లి రిమ్స్‌లో ఉన్న ఎంపీడీవోను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎంపీడీవోను అమానుషంగా కొట్టారని తెలిపారు. అధికారులపై దాడిచేయడం వైసీపీకి కొత్తమీ కాదని ఆరోపించారు. దాడులకు దిగి భయపెట్టాలని చూస్తే గత ప్రభుత్వం మాదిరి తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించం. ఇంకా వైసీపీ రాజ్యం అనుకుంటున్నారా.. ఖబడ్దార్, తోలు తీసి కూర్చోపెడతామని వైసీపీ నాయకులను హెచ్చరించారు.
ఘటనాస్థలికి సీఐ వెళ్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాలేదని, వైసీపీ నాయకులకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయని ఆరోపించారు. వైసీపీ దౌర్జన్యాలను ఎలానియంత్రిచాలో తెలుసు.. చేసి చూపిస్తామని అన్నారు. దాడి చేసిన వారిని ఎవరూ రక్షించలేరని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏంటో చేసి చూపిస్తామని పేర్కొన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఘటనపై విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

