Pawan Kalyan | స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద 70 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం అదనంగా ఉందని, అది విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఇవ్వాలని ఏ ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎందుకు కేంద్రాన్ని అడుగరని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పడేస్తే వచ్చింది కాదని, పోరాడి సాధించుకున్నదని గుర్తు చేశారు. కేంద్రం తమ మాట వినదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నేతలు చెబుతుంటారని, కానీ వారి పదవుల కోసం, కాంట్రాక్టుల కోసం వారి మాట వింటుందా? అని నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలకు అర్థాలే వేరని పేర్కొన్నారు.
విద్యార్థులకు అండగా నిలుస్తామంటే రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యా సంస్థలను పూర్తిగా మూసేయడం అని అర్థం అని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. సంపూర్ణ మధ్య నిషేధం అంటే సంపూర్ణంగా మద్యం అమ్ముదామని అర్థం అని అన్నారు. రైతులకు రూ.12,500 ఇస్తున్నాం అంటే కేంద్రం ఇచ్చే రూ.6000లతో కలిపి అని అర్థం అని చెప్పారు.