అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ వచ్చింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం పవన్ కల్యాణ్‌తో పాటు ప్రోగ్రాం కమిటీ నాయకులు , సెక్యూరిటీ సిబ్బంది కూడా వైరల్ ఫీవర్ బారిన పడ్డారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాయకుడు నాదేండ్ల మనోహర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 24 న జరగాల్సిన జనవాణి వాయిదా వేసి ఈ నెల 31 న రాయలసీమ లేదా ఉత్తారాంధ్రలో తదుపరి జనవాణి ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు ఐదు విడతలకు గానూ మూడు విడతల జనవాణిని పూర్తిచేశామని వివరించారు.