నారాయణ, శ్రీచైతన్యల నుంచే పేపర్ లీక్‌లు: ఏపీ సీఎం జగన్
ap cm jagan | రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌లు చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తికి చెందిన నారాయణ, శ్రీచైతన్య
అమరావతి : రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌లు చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తికి చెందిన నారాయణ, శ్రీచైతన్య కళాశాలల నుంచే అవుతున్నాయని ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఓర్వలేక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
జగనన్న విద్యాదివేన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద 10 లక్షల 85 వేల మంది విద్యార్థులకు రూ. 709 కోట్లను సీఎం ఇవాళ తిరుపతిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు హయాంలో విద్యార్థుల గురించి ఏనాడు పట్టించుకోలేదని, తాము నాడు-నేడు ద్వారా పలు పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. టీడీపీ హయాంలో విద్యార్థులకు అరకొర ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో గవర్నమెంట్ బడులు మూసివేయాలన్నదే చంద్రబాబు ఆలోచన అని దుయ్యబట్టారు. క్రమం తప్పకుండా విద్యార్థులకు వసతి దీవెనను అమలు చేస్తున్నామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షా 30వేల మంది నిరుద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. అసంపూర్తిగా మిగిల్చిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి అక్క చెల్లెమ్మలకు అందజేస్తున్నామని అన్నారు. చంద్రబాబు పాలనను, తమ పాలనను భేరిజు వేసుకోవాలని ప్రజలను కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

