అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ(Allaiance Governmen) అధ్వాన్న పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, నాయకులు, కార్యకర్తలు ప్రజల తరఫున పోరాటం చేయాలని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పిలుపునిచ్చారు. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్న టీడీపీ (TDP) వైనాన్ని ఎండగట్టాలని సూచించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కూటమి హామీలపై (Promises) నాయకులను నిలదీయాలని సూచించారు. ఆరునెలల కాలంలోనే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై తప్పుడు కేసులు పెడుతూ జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. ఆరు నెలల్లోనే వైసీపీ (YCP) పాలనను, కూటమి పాలనను ప్రజలు బేరిజు వేసుకుంటున్నారని అన్నారు.
వైసీపీ పాలన అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటి నుంచే కార్యకర్తలకు అండగా ఉండేందుకు అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. సంక్రాంతి (Sankranthi) తరువాత ప్రతి బుధ, గురువారాల్లో జిల్లాల్లోనే ఉంటానని ప్రకటించారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులకు ఫీజులు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. రాజకీయ పార్టీలకు కష్టాలు రావడం సహజమేనని వాటిని ధైర్యంగా ఎదుర్కొవాలని సూచించారు. ప్రజల్లో వైసీపీపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుకునేలా నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని కోరారు.