TTD | ఆధార్ ఉంటేనే తిరుమల లడ్డూలు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ!
TTD | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. భక్తులకు కేవలం రెండు లడ్డూలు మాత్రమే ఇస్తారని.. అదనంగా కావాలంటే ఆధార్ తప్పనిసరి అని వస్తున్న వార్తలను ఖండించింది. అదంతా అవాస్తవమని పేర్కొంది.
TTD | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. భక్తులకు కేవలం రెండు లడ్డూలు మాత్రమే ఇస్తారని.. అదనంగా కావాలంటే ఆధార్ తప్పనిసరి అని వస్తున్న వార్తలను ఖండించింది. అదంతా అవాస్తవమని పేర్కొంది.
ఒకసారి లడ్డూలు తీసుకుంటే తిరిగి నెల రోజుల తర్వాతే మళ్లీ లడ్డూలను తీసుకునేందుకు అవకాశం ఉంటుందని.. దళారులను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి పేరుతో ఒక వార్త ప్రచారం జరిగింది. దీనిపై వివరణ ఇచ్చిన టీటీడీ.. లడ్డూ విక్రయ విధానాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. దర్శనం చేసుకున్న తర్వాత భక్తులకు ఇచ్చే ఉచిత లడ్డూతో పాటు నాలుగు నుంచి ఆరు లడ్డూల వరకు విక్రయిస్తామని చెప్పింది. దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు మాత్రమే ఆధార్ కార్డు నమోదుతో రెండు లడ్డూలు విక్రయిస్తామని క్లారిటీ ఇచ్చింది. నెలకు ఒకసారి మాత్రమే లడ్డూలు అన్నది నిజం కాదని.. అదనపు లడ్డూలను ప్రతిరోజూ తీసుకోవచ్చని తెలిపింది.
టికెట్స్, టోకెన్స్ లేకుండానే కొంతమంది లడ్డూలను కొనుగోలు చేస్తున్నారని.. వాటిని బయట బ్లాక్‌లో అధిక ధరలకు అమ్ముతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అందుకే టోకెన్లు లేని వారికి ఆధార్ నిబంధన పెట్టామని చెప్పారు. దళారీలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

