అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి : ఏపీ సీఎం జగన్
అప్రమత్తంగా ఉండాలి | యాస్ తుపాన్ రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు.

అమరావతి : యాస్ తుపాన్ రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. తుపాన్ ప్రభావితం చేస్తున్నదని అంచనా వేస్తున్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తుపాను దృష్ట్యా ముందస్తు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఆ రాష్ట్ర సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో అక్కడక్కడా జల్లులు మినహా తుపాన్ ప్రభావం పెద్దగా లేదని సీఎంకు తెలిపారు. తాత్కాలిక నిర్మాణాల్లో కొవిడ్ రోగులు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆక్సిజన్ కొరత రాకుండా జనరేటర్లు, డీజిల్ అన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

