అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 1,217 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,535 మంది కోలుకున్నారు. మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 20,01,255కు పెరిగాయి. ఇవాళ్టివరకు 19,72,399 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇంకా 15,141 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,715కు చేరాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,678 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.