Vijayasai Reddy | ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు లోక్‌సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి నుంచి మొదలు ఇతర టీడీపీ నేతలు అందరూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో భూములు ఆక్రమించానని తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వేంకటేశ్వరస్వామి భక్తుడిని అని.. వెంకన్న మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. విశాఖలో ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీకి ద్రోహం చేసి టీడీపీలో చేరారరని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. కోటంరెడ్డి ప్రజాసేవ మరిచి దందాలకు అలవాటు పడ్డారని ఆరోపించారు. కోటంరెడ్డి లాంటి వ్యక్తికి ఓటేస్తే ప్రశాంతత ఉండదని హెచ్చరించారు.