అరకులో విషాదం.. ముగ్గురు చిన్నారులు సహా తల్లి మృతి
అరకులో విషాదం| ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. అరకులోయలో ముగ్గురు చిన్నారులు సహా తల్లి అనుమానస్పద స్థితిలో మృతిచెందింది.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. అరకులోయలో ముగ్గురు చిన్నారులు సహా తల్లి అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. పిల్లలకు పురుగుమందు తాగించిన తల్లి, అనంతరం తాను కూడా ఉరేసుకుని మృతిచెందింది. అరకులోయలో మండలం సిమిలిగూడకు చెందిన సురేఖ, శెట్టి సంజీవ్ భార్యా భర్తలు. వారికి కూతురు సుశాన, ఇద్దరు కుమారులు షర్విన్, సిరిల్ ఉన్నారు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సురేఖ ఇంట్లో ఉరికి వేలాడుతున్న స్థితిలో స్థానికులు గుర్తించారు. అదేవిధంగా మంచంపై విగత జీవులుగా పడి ఉన్న పిల్లలను దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ముగ్గురు చిన్నారులు మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

