AP Minister Nadendla | ఏపీ కూటమిలో సంచలనంగా మారిన మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలు
AP Minister Nadendla | ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh) లోని కూటమి ( Alliance ) ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సీట్ల పంపిణి ఫార్ములా స్థానిక సమరంలో వర్తించదని ఆయన స్పష్టంచేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీచేసి ఘన విజయం సాధించిన జనసేన ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పట్లో పవన్ కల్యాణ్ ఒక అడుగు వెనక్కితగ్గారని ,ఇప్పుడు పార్టీల బలాబలాల ఆధారంగా సీట్ల పంపిణీ ఉంటుందని అన్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన వారందరికీ స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.
ఎన్డీయే సమన్వయ కమిటీ సమావేశాల్లో అన్నిఅంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటా మని వివరించారు. బలాబలాలను చూసుకుని జనసేన కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలు పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా , అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా కూటమి నాయకత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

