10th Class Results | ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి
ఆంధ్రప్రదేశ్ (AP) పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) విజయవాడలో పదో తరగతి ఫలితాలను (10th Class Results) విడుదల చేశారు. పరీక్ష హాజరైన విద్యార్థుల్లో 72.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ (AP) పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) విజయవాడలో పదో తరగతి ఫలితాలను (10th Class Results) విడుదల చేశారు. పరీక్ష హాజరైన విద్యార్థుల్లో 72.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 75.38 శాతం మంది బాలికలు ఉండగా, 69.27 శాతం మంది బాలులు ఉన్నారు. 933 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత రాగా, 38 పాఠశాల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదయింది. కాగా, ఉత్తీర్ణ సాధించినవారిలో 75.8 శాతం మందికి ఫస్ట్ క్లాస్ రాగా.. పాసైనవారిలో ఇంగ్లిష్ మీడియాలో రాసిన స్టూడెంట్ 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 18 వరకు నిర్వహించిన పరీక్షలకు మొత్తం 6,05,052 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో బాలురు 3,09,245, బాలికలు 2,95,807 మంది హాజరైన వారిలో ఉన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయినవారికోసం జూన్ 2 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి బొత్స తెలిపారు. విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఈనెల 13వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలకు, అత్యధిక శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు, ఆయా స్కూల్ టీచర్లను పోత్సహించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలు పాల్పడొద్దని.. పరీక్షలో ఫెయిల్ అయిన వారికి ప్రత్యేకంగా కోచింగ్ ఇప్పిస్తామని వెల్లడించారు. విద్యా సంవత్సరం వృథా కాకుండా వెంటనే ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు.
పదో తరగతి పరీక్షాఫలితాలను https://results.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | ముప్పు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. సైన్యానికి రక్షణ మంత్రి పిలుపు
‘గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించే వరకు పోరాటం’
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డుకు చిత్రియాల సర్పంచ్ ఎంపిక
కోదాడ కిట్స్‌లో ప్రాంగణ ఎంపికలు.. 44 మందికి ఉద్యోగాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

