అమరావతి : గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్‌కు సమీపంలోకి వచ్చిన శ్రీలంక బోటును ఒడ్డుకు చేర్చేందుకు మెరైన్ పోలీసులు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. నిన్న హార్బర్ కు సుమారు 4 కిలోమీటర్ల సముద్రంలో శ్రీలంక బోటు ఇరుక్కుపోయి స్థానిక జాలరులకు కనిపించింది. దీంతో వారు పోలీసులకు అందించిన సమాచారం మేరకు మెరైన్ పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లి వాకాబు చేశారు.
బోటులో ఎవరూ లేకపోవడంతో బోటులో చేపల వేటకు ఉపయోగించే వలలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే బోటును ఒడ్డుకు చేర్చేందుకు పోలీసులు చేసిన యత్నాలు ఫలించకపోవడంతో ఈరోజు మెరైన్, కోస్ట్ గార్డ్ పోలీసులు పెద్దబోట్లతో సముద్రంలోకి వెళ్లి ప్రయత్నాలను ముమ్మరం చేశారు.