తిరుమల ఘాట్‌రోడ్, సన్నిదానం గెస్ట్‌హౌస్ వద్ద చిరుత సంచారం

అమరావతి : ఇటీవలి కాలంలో తిరుమల పరిసరాల్లో చిరుతల సంచారం తరచుగా వెలుగులోకి వస్తోంది. శుక్రవారం సైతం తిరుమలలోని రెండు ప్రదేశాల్లో చిరుతపులి కనిపించింది. సెకండ్ ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయం వద్ద ఓ వాహనాన్ని చిరుతపులి దాటుకుంటూ వెళ్లింది. ఆకస్మాత్తుగా చిరుత అగుపించడంతో భక్తులు భయభ్రాంతులకు లోనయ్యారు. అప్పటిదాక తిరుమల పరిసరాల సోయగాలను తమ సెల్ఫోన్లలో బంధిస్తున్న భక్తులు ఒక్కసారిగా సెల్ఫోన్లు బంద్ చేసి వాహనాల విండోస్‌ను బంద్ చేసుకున్నారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అదేవిధంగా ఈ ఉదయం తిరుమల సన్నిదానం గెస్ట్‌హౌస్ వద్ద చిరుతపులి గ్రాండింపులు చేసింది. సన్నిదానం సమీపంలోని రెస్టారెంట్ వద్ద పందులను వేటాడేందుకు చిరుత వచ్చినట్లుగా సమాచారం. రెస్టారెంట్ సిబ్బంది గమనించడంతో అది పారిపోయింది. సన్నిదానం గెస్ట్‌హౌస్ వద్ద తరచుగా చిరుతపులి కనిపిస్తుందని భక్తులు, టీటీడీ సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

