AP Ordinance | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ మద్యంషాపులు రద్దు చేస్తూ ఆర్డినెన్స్
AP Ordinance | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యంషాపులను రద్దు చేస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యంషాపుల( Government Liquor shops ) ను రద్దు చేస్తూ ఆర్డినెన్స్‌ను(Ordinance) తీసుకొచ్చింది. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు. ఈ విధానాన్ని మారుస్తూ ప్రభుత్వం రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది.
అక్టోబర్ 1 నుంచి కొత్త లిక్కర్ పాలసీ రాబోతుంది. ఇటీవల కొత్త లిక్కర్ పాలసీకి క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో టీడీపీ హయాంలో 2014-19 వరకు ఉన్న మళ్లీ పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు జరపనున్నారు. మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేట్‌కే అప్పగించనున్నారు. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ ద్వారా మద్యం షాపులను జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా 3396 వైన్ షాప్స్ ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు పది శాతం దుకాణాలు కేటాయించనున్నారు. మరో 396 దుకాణాలను అదనంగా నోటిఫై చేయనున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

