తెలంగాణలో స్థిరపడుతా

- ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం లేదు
- సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిసిన మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ): ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం లేదని, తాను తెలంగాణలో స్థిరపడతానని ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించా రు. ఏపీలో పరిస్థితులు బాగాలేవని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ వద్దకు వచ్చిన జేసీ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మంత్రి కే తారకరామారావుతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి కలిశానని చెప్పారు. తమ మధ్య రాజకీయాలు చర్చకు రాలేదని అన్నారు. తెలంగాణతో కలవకపోవడం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందని, రాయలతెలంగాణకు ఇక్కడివారు ఒప్పుకోలేదని పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌లో తాను చెప్పినట్టుగానే జానారెడ్డి గెలవలేదని గుర్తుచేశారు. తాను 1980లో సమితి ప్రెసిడెంట్‌గా గెలిచినప్పుడు రూ.10 వేలు ఖర్చుకాగా, ఇప్పుడు ఎంపీగా నిలబడితే రూ.50 కోట్లు ఖర్చయిందని, ఒక్కొక్క ఓటుకు నాలుగైదువేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నదని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- JC Diwakar reddy
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

