Janasena | ఈనెల 9న పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ కార్యనిర్వాహక సమావేశం..

అమరావతి: జనవరి 9వ తేదీన మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యనిర్వాహక సమావేశం జరుగనున్నది. ఈ సమావేశానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధ్యక్షత వహించనున్నారు. జనవరి 9వతేదీన ఉదయం11గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రైతుల సమస్యలు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి చర్చిస్తారు.
అంతేకాకుండా జనసేన పార్టీ కార్యక్రమాలను సమీక్షిస్తారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మండల అధ్యక్షులను నియమించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు పవన్. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పి.ఏ.సి. సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల చైర్మన్లు పాల్గొననున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

