AP Minister Anitha | విశాఖ స్టీల్ ప్లాంట్ అనే పదం పలకడానికి జగన్‌కు అర్హత లేదు : ఏపీ మంత్రి అనిత
AP Minister Anitha | విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు ఉద్యమంతో ప్రారంభమైన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించిందని ఏపీ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
అమరావతి : విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు ఉద్యమంతో ప్రారంభమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ( Visakha Steel Plant ) ను ప్రైవేటీకరణ చేయడానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించిందని ఏపీ మంత్రి వంగలపూడి అనిత ( AP Minister Anitha ) వెల్లడించారు. బుధవారం ఆమె టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో కలసి విశాఖలో మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ( YS Jagan ) మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు.
స్టీల్ ప్లాంట్‌ను అక్కడి నుంచి తొలగించి రాజధాని నిర్మాణం చేయాలని ప్రయత్నించినట్లు సాక్షాత్తు జగన్ వద్ద సీఎస్‌గా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించిన వీడియోను ఆమె ప్రదర్శించారు. వైసీపీ హయాంలో దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల పాటు విశాఖ ఉక్కు ఉద్యోగులు, కార్మికులు ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ధర్నాలు, నిరసనలు చేశారని పేర్కొన్నారు.
గత శనివారం స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యుద్దప్రాతిపదికన స్పందించిందని తెలిపారు. స్వయాన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, రాష్ట్రానికి చెందిన మంత్రులు ఘటనా స్థలాన్ని స్పందించడంతో పాటు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారని వివరించారు.
కోటి రూపాయలకు పైగా బాధితులకు పరిహారాన్ని ప్రకటించారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ నియమ నిబంధనలతో పనిలేకుండా పరిహారం, ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. బుధవారం బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్ జగన్ శవ రాజకీయాలకు పాల్పడడం విచారకరమని ఆరోపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

