అమరావతి : పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి తీరా అధికారం కోల్పోయిన తరువాత పార్టీపై బురద చల్లడం సరికాదని వైసీపీ నాయకురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి (MLC Varadu Kalyani) ఆరోపించారు. వాసిరెడ్డి పద్మ ( Vasireddy Padma) కు వైఎస్ జగన్ క్యాబినెట్ హోదా గల మహిళా చైర్పర్సన్ పదవి ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు.
ప్రస్తుతం పార్టీకి రాజీనామా చేస్తూ అధినేత జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసి రాజకీయం కోసం ఆత్మవంచన చేసుకోవద్దని సూచించారు. జగన్ కార్యకర్తలను పట్టించుకోకపోతే మహిళా చైర్పర్సన్ పదవి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పదవులు పూర్తిగా అనుభవించి నైతిక విలువలు గురించి మాట్లాడడం సరికాదని అన్నారు. వ్యక్తిగత స్వార్థంతో విమర్శలు చేయడం మానుకోవాలని కోరారు.
కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగి పోయాయయని ఆరోపించారు. బాధితులను ప్రభుత్వం పట్టించుకోకపోతే వైఎస్ జగన్ వారికి అండగా నిలబడుతూ, వారిని పరామర్శిస్తూ , ఆదుకుంటూ ధైర్యం చెబుతున్నారని పేర్కొన్నారు. మహిళల తరుఫున పోరాటం చేయడం రాజకీయంగా కనిపిస్తుందా అంటూ పద్మను ప్రశ్నించారు.