నెల్లూరు: ఇస్కాన్ నెల్లూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఉత్సవాలకు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని వచ్చే నెల 1 వ తేదీ నుంచి 20 రోజుల పాటు అంతర్జాతీయ ఆన్లైన్ సాంస్కృతిక పోటీలు జరుగనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవంగా నిలువనున్న ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. నాలుగేండ్ల చిన్నారి మొదలుకొని 80 ఏండ్ల వృద్ధుల వరకు వయసుతో నిమిత్తం లేకుండా అన్ని పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పి్స్తున్నారు. ఎంట్రీలకు ఎలాటి పరిమితి లేదు. అలాగే ఎన్ని ఈవెంట్లలోనైనా పాల్గొనవచ్చు.
ఈవెంట్లు : కలరింగ్, క్లాసికల్ డ్యాన్స్, జానపద నృత్యం, ఫ్యాన్సీ డ్రెస్, గీతాశ్లోకం, గాత్ర సంగీత, వాయిద్య సంగీతం, రిథమ్స్, కుకరీ, ఫ్లవర్ డెకరేషన్, రంగోలి, మోనో యాక్షన్, డ్యాన్స్ డ్రామా, కథ చెప్పడం, చేతివ్రాత, వ్యాస రచన, మార్పు అలంకరణ, పద్యాలు, గార్లాండ్ మేకింగ్, గజల్ గానం, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, పెయింటింగ్, హైడ్ అండ్ సీక్, 2డీ/3డీ యానిమేషన్, పీపీటీ మేకింగ్, దహీ హండీ.
300 ఉప కేటగిరీలతో మొత్తం 55 ప్రధాన కేటగిరీలకు రిజిస్ట్రేషన్లు అందుబాటులో వచ్చాయని ఇస్కాన్ నెల్లూరు శాఖ అధ్యక్షుడు స్వామి సుఖ్దేవ్ వివరించారు. ఏదైనా ఈవెంట్లకు సంబంధించి సందేహాల నివృత్తి కోసం https://iskconlms.dhanushinfotech.com/ గానీ, cmkdasa@gmail.com లోగానీ సంప్రదించవచ్చు: రిజిస్ట్రేషన్లకు ఎటువంటి ఛార్జీలు లేవు. వ్యక్తులు సమూహంగా లేదా వ్యక్తిగతంగా ఈవెంట్లలో పాల్గొనవచ్చు. మరిన్ని వివరాల కోసం వాట్సాప్ నంబర్లు +91 8977637108, +91 8919717982 అందుబాటులో ఉంచారు. ఈవెంట్ల ఫలితాలు ఆగస్టు 25-31 మధ్య ప్రకటించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.