Heavy rains | తీవ్ర వాయిగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో(Andhrapradesh) వర్షాలు(Heavy rains) దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లతున్నాయి. ఈదురు గాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడి రోడ్డుపై పడ్డాయి. పంటలు నీట మునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.
విశాఖ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్‌కు, హైదరాబాద్‌కు నుంచి రాజమహేంద్రవరం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్ లైన్స్ విమానాన్ని బెంగళూరు మళ్లించారు. ఈ క్రమంలో ప్రయాణికులు విమాన వివరాలను చెక్ చేసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు.