అలాంటి బుద్ధి ఆయనకొక్కడికే ఉన్నది: ఎంపీ విజయసాయిరెడ్డి
ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. డీజీపీ పదవి నుంచి గౌతమ్ సవాంగ్‌ను మార్చడంలో ఏమాత్రం రాజకీయంల లేదని, డీజీపీలను మార్చే బుద్ధి చంద్రబాబుకు ఒక్కడికే...
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్‌ను ఆకస్మికంగా తొలగించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా బహిరంగంగా విమర్శలు చేశారు. దీనిపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. డీజీపీ పదవి నుంచి గౌతమ్ సవాంగ్‌ను మార్చడంలో ఏమాత్రం రాజకీయంల లేదని, డీజీపీలను మార్చే బుద్ధి చంద్రబాబుకు ఒక్కడికే ఉన్నదన్నారు.
చంద్రబాబు హయాంలో నలుగురు డీజీపీలను మార్చారని ట్విటర్లో తెలిపారు. అయితే, ఈ విషయాన్ని టీడీపీ నేతలు మరిచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. గౌతమ్ సవాంగ్‌పై ఏదో ప్రేమ ఒలకబోస్తున్నట్లు పచ్చ బ్యాచ్ గగ్గోలు పెడుతుందని విమర్శించారు. అయితే, సవాంగ్ సేవలను మరో రకంగా వినియోగించుకోవడానికే ఇలా నిర్ణయం తీసుకున్నదని, దీంతో టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదన్నారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేయడం చంద్రబాబు మార్క్ రాజకీయమని విమర్శించారు. అలాంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు. సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా చేయడంతో పచ్చ మీడియాకు షాక్ తగిలిందని పేర్కొన్నారు.
సవాంగ్ అనూహ్య బదిలీపై అటు పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. ఆయనను తప్పించడానికి గల కారణాలను ప్రజలకు వివరించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. విజయవాడలో ఉద్యోగుల ర్యాలీ విజయవంతం కావడంతోనే ఆయనను తప్పించారని అన్ని వర్గాల వారు వ్యాఖ్యానించారు.
చంద్రబాబు5 ఏళ్ల పాలనలో నలుగురు డీజీపీలను మార్చినా ఒక్కరూ మాట్లాడలేదు. జగన్ గారి హయాంలో 30 నెలలు డీజీపీగా చేసిన గౌతమ్ సవాంగును మారిస్తే ఆయనపై ఎదో ప్రేమున్నట్లు పచ్చ బ్యాచ్ గగ్గోలు. సవాంగ్ ను APPSC చైర్మన్ చేయడంతో పచ్చ మీడియాకు షాక్. ఏరుదాటాక తెప్ప తగలేయడం బాబు మార్క్ పాలిటిక్స్.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 17, 2022
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

