అమరావతి : ఏపీ అమరావతి ప్రజల కోరిక నెరవేరడం సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి (Former Vice President) వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. రాజధాని లేని రాష్ట్రం తల లేని మొండెం లాంటిందని అన్నారు. రాజధాని ఒక్కటే ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని పేర్కొన్నారు. అమరావతి (Amaravati) ఉద్యమం విలువైన పాఠమని వెల్లడించారు.
ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది లేదని, అమరావతి రైతులు, మహిళలు నిరూపించింది ఇదేనని అన్నారు. 1,631 రోజుల శాంతియుత ఉద్యమం గొప్ప విషయమని అమరావతి ప్రాంత ప్రజలను అభినందించారు. చట్ట, పరిపాలన, న్యాయ సభలు ఒకే వద్ద ఉంటేనే కలిసికట్టుగా ముందుకు పోవడానికి ఆస్కారం జరుగుతుందని అన్నారు. ఇది రాజకీయాలతో సంబంధంతో మాట్లాడడం లేదని అన్నారు. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తారని భావిస్తున్నానని పేర్కొన్నారు.