పది, ఇంటర్ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ మంత్రి స్పష్టత.. ఏమన్నారంటే.?
పది, ఇంటర్ పరీక్షలపై స్పష్టత | ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం స్పష్టత నిచ్చారు.

అమరావతి : ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం స్పష్టత నిచ్చారు. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. మంగళవారం ప్రకాశం జిల్లా పర్యాటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షలను కూడా ప్రతిపక్షం రాజకీయాలకు వాడుకోవడం హేయనీమని ఆయన విమర్శించారు. ఇతర రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తే ఇక్కడా కూడా చేయాలని విపక్షాలను ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నాయా.? అని మంత్రి నిలదీశారు. అపోహలను వీడి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. గతంలో పరీక్షలు రద్దు చేసిన కారణంగా చాలా ఇబ్బందులు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత అకాడమిక్ క్యాలెండర్ను ప్రకటిస్తామని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

