అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రొటెం స్పీకర్ (Protem Speaker) గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chaudhary ) ప్రమాణం చేశారు. గురువారం రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుర్ నజీర్ గోరంట్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Kesav), ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
రేపటి నుంచి రెండురోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతుండడంతో ఎన్నికైన ఎమ్మెల్యేలలో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు. రేపు ఉదయం 9.46 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. కొత్తగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కొలువుదీరిన ప్రభుత్వం అసెంబ్లీలో మరోమారు అడుగుపెట్టనుంది.
ఇటీవల ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ 11 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బుచ్చయ్యచౌదరిని చంద్రబాబు ప్రొటెం స్పీకర్గా నియమించారు.