అమరావతి : వైసీపీ మాచర్ల మాజీ ఎమ్మెల్యే (Former YCP MLA) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) శనివారం జైలు నుంచి విడుదలయ్యారు(Release). రెంటచింతల, కారంపూడిలో నమోదైన కేసుల్లో బెయిల్ రావడంతో 55 రోజుల పాటు జైల్లో ఉన్న పిన్నెల్లి శనివారం బయటకు వచ్చారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రులు కాకాణి గోవర్దన్ రెడ్డి(Kakani Goverdan Reddy) , అనిల్‌కుమార్ యాదవ్ జైలు బయట స్వాగతం పలికారు. కాకాణి మాట్లాడుతూ ప్రజా నాయకుడు పిన్నెల్లి పై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని విమర్శించారు. చంద్రబాబును (Chandrababu) విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని, కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే తాము భయపడబోమని అన్నారు.
పోలింగ్ రోజున ఏపీలో అనేక చోట్ల ఈవీఎంల ధ్వంసం జరుగగా కేవలం పిన్నెల్లిపైనే కేసు నమోదు చేయడం కక్షపూరిత చర్య అని ఆరోపించారు. చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎవరికి అధికారం శాశ్వతం కాదని గుర్తించుకోవాలని సూచించారు. వందరోజుల్లో సుపరిపాలన అందిస్తానని చెప్పిన చంద్రబాబు హామీ నెరవేరక పోవడంతో ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నాం కదాని విధ్వంసాలకు పాల్పడుతున్న చంద్రబాబు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లంచక తప్పదని హెచ్చరించారు.