YS Sharmila | ఏపీలోనూ రైతుల రుణమాఫీ చేయాలి : వైఎస్ షర్మిల డిమాండ్
YS Sharmila | తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లోనూ రైతుల రుణమాఫీ చేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం ఎక్స్ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమరావతి : తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనూ రైతుల రుణమాఫీ (Farmers loans) చేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) శుక్రవారం ఎక్స్ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల తలసరి అప్పులో, దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ ఎందుకు చేయరని ఆమె ప్రశ్నించారు.
సుమారు రూ. 2,45,554 రుణం ప్రతి రాష్ట్ర రైతు నెత్తి మీద కత్తిలా వేలాడుతోందని పేర్కొన్నారు. గడచినా దశాబ్దంలో అటు కరువు, తుఫానులు, ఇటు పూర్తికాని ప్రాజెక్టులు, సర్కారుల నిర్లక్ష్యం, వెరసి రాష్ట్ర వ్యవసాయం సర్వనాశనం అయిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మరి డబుల్ ఇంజిన్ సర్కారు నడుపుతున్న కూటమి సర్కార్, కేంద్ర సాయంతో ఎందుకు రుణమాఫీ చేయరని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే, రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా చేసి ఉండేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా రైతు రుణమాఫీ చేసి, చితికిపోయిన ఏపీ రైతులకు చేయూతనివ్వాలని ఆమె కోరారు. ఇది ఛాయిస్ కాకూడదు, బాధ్యత అనుకోవాలని సూచించారు.
Read more :
AP News | పిల్లల అల్లరి మాన్పించేందుకు డ్రామా.. ఉరి బిగుసుకుని తండ్రి మృతి
Daggubati Purandheswari | రాష్ట్రంలో హింస పెరిగిందని కేంద్రానికి జగన్ లేఖ.. మండిపడ్డ పురంధేశ్వరి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

