AP News | పిల్లల అల్లరి మాన్పించేందుకు డ్రామా.. ఉరి బిగుసుకుని తండ్రి మృతి
AP News | పిల్లలను బెదిరించడానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం అతని ప్రాణాలను బలితీసుకుంది. వాళ్ల అల్లరిని మాన్పించేందుకు ఆ తండ్రి చనిపోతానని హెచ్చరించాడు. కానీ వాళ్లు వినిపించుకోకపోవడంతో ఉరేసుకుంటున్నట్లు డ్రామా ఆడబోయి ఉచ్చు బిగుసుకుని మరణించాడు.
AP News | పిల్లలను బెదిరించడానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం అతని ప్రాణాలను బలితీసుకుంది. వాళ్ల అల్లరిని మాన్పించేందుకు ఆ తండ్రి చనిపోతానని హెచ్చరించాడు. కానీ వాళ్లు వినిపించుకోకపోవడంతో ఉరేసుకుంటున్నట్లు డ్రామా ఆడబోయి ఉచ్చు బిగుసుకుని మరణించాడు. ఏపీలోని వైజాగ్‌లో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బిహార్‌కు చెందిన చందన్ కుమార్ (33) ఇండియన్ రైల్వేస్‌లో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్‌గా పనిచేస్తున్నాడు. ఐదేళ్లుగా వైజాగ్‌లోని కొత్తపాలెంలో నివాసం ఉంటున్నాడు. చందన్‌కు ఒక కూతురు (7), కొడుకు (5) ఉన్నారు. ఇటీవల వీళ్ల అల్లరి ఎక్కువయ్యింది. వాళ్లను ఏమైనా గట్టిగా ఒక మాట అంటే.. భార్య కూడా పిల్లలకే వత్తాసు పలుకుతుంది. తాజాగా బుధవారం రాత్రి కూడా ఇలాగే జరిగింది. చందన్ జేబులో నుంచి కరెన్సీ నోట్లను తీసుకున్న ఇద్దరు పిల్లలు వాటిని చించేశారు. అది చూసిన చందన్ వారిని మందలించాడు. కోప్పడుతున్న చందన్‌ను చూసి భార్య అడ్డుపడింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
ఆ గొడవ తర్వాత తనకు ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నారని.. ఇలాగే చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని చందన్ బెదిరించాడు. కానీ చందన్ మాటలను భార్యాపిల్లలు పట్టించుకోలేదు. దీంతో ఫ్యాన్ హుక్కు చీరకట్టి దాన్ని మెడకు చుట్టుకుని వాళ్లను భయపెట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రమాదవశాత్తూ చీర మెడకు బిగుసుకుపోయింది. తమను బెదిరించేందుకు చందన్ అలా చేస్తున్నాడని అతని భార్య అనుకుని చాలాసేపటి దాకా పట్టించుకోలేదు. అయితే ఎంతసేపటికీ ఉలుకుపలుకు లేకుండా అలాగే ఉండిపోయేసరికి అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూసి చీరను విప్పేసింది. కానీ అప్పటికే ఉరిపడటంతో తీవ్ర అస్వస్థతకు గురై చందన్ కన్నుమూశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చందన్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- Crime news
- Suicide
- vizag
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

