Tirupati | తిరుపతి జిల్లాలో నకిలీ పోలీసు వ్యవహారం సంచలనం రేపింది. అర్ధరాత్రి వేళ ఓ హోం స్టే వద్దకు అమ్మాయితో వచ్చిన ఓ వ్యక్తి.. రూం కావాలని బెదిరింపులకు దిగాడు. ఫ్రెష్ అప్ అయ్యి వస్తానని అమ్మాయితో గదిలోకి వెళ్లి మూడు గంటలైనా రాకపోవడంతో అనుమానం వచ్చి హోం స్టే నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం ఈ వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీస్ యూనిఫామ్ ధరించి ఓ వ్యక్తి తిరుపతి అలిపిరిలోని విహా హోం స్టే వద్దకు వచ్చాడు. ఓ అమ్మాయితో వచ్చిన అతను కానిస్టేబుల్ అని చెప్పి రూం కావాలని అడిగాడు. ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపట్లోనే వస్తామని, రూం ఇవ్వాలని సిబ్బందిని బెదిరించాడు. దీంతో భయపడిన హోం స్టే నిర్వాహకులు అతనికి గదిని ఇచ్చారు.
అయితే శనివారం తెల్లవారుజామున 3 గంటలకు అమ్మాయితో కలిసి గదిలోకి వెళ్లిన వ్యక్తి.. ఉదయం 6 గంటలు అవుతున్నా గది తలుపులు తీయకపోవడంతో హోం స్టే నిర్వాహకులను అనుమానం వచ్చింది. వెంటనే మేనేజర్ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు హోం స్టే వద్దకు చేరుకుని సదరు వ్యక్తిని విచారించారు. అయితే సదరు వ్యక్తి అసలు పోలీస్ కాదని.. కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకుని తిరుగుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ నకిలీ పోలీసు పేరు దాసరి కార్తీక్ అని.. అతను గుంటూరు జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు.
తిరుపతిలో నకిలీ పోలీసు హల్చల్
అలిపిరిలోని విహా హోం స్టేకు ఒక మహిళతో వచ్చి.. ఫ్రెష్-అప్ అవ్వడానికి రూమ్ ఇవ్వాలని బెదిరింపులు
తాను పోలీస్ కానిస్టేబుల్‌నని బెదిరించి.. కొద్దిసేట్లో ఫ్రెష్-అప్ అయ్యి వస్తామని మహిళతో వెళ్లిన ఓ వ్యక్తి
రూమ్ తీసుకున్నాక ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో..… pic.twitter.com/7aVJy597QZ
— PulseNewsBreaking (@pulsenewsbreak) July 18, 2026