అమరావతి : అనంతపురం(Anantapuram) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ రవాణా కార్యాలయం సమీపంలోని ఓ దుకాణంలో పేలుడు(Explosion) సంబవించి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాలకు పెయింటింగ్(Vehicle painting) వేసే దుకాణంలో పనిచేస్తున్న వాచ్మెన్ సతీష్ పదేళ్ల క్రితం నాటి కెమికల్ డబ్బా(Chemical box) ఓపెన్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలిపోయింది.
పేలుడు దాడికి ఆ వ్యక్తి ముక్కలు ముక్కలయ్యాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.