తిరుపతి: తిరుమలలోని కాకులకొండ ప్రాంతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లో చెత్త నుంచి తయారు చేసిన ఎరువులను జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు.
దీనికి సంబంధించి మరిన్ని వివరాలకు మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2263759 నంబరులో కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in లేదా www.tirumala.org ను గానీ సంప్రదించవచ్చు.