Duvvada Srinivas | తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారం తెలియని వారుండరనే చెప్పొచ్చు. టెక్కలిలోని దువ్వాడ ఇంటి ముందు ఆయన భార్యాపిల్లలు ధర్నా చేయడంతో ఈ జంట వ్యవహారం బయటకొచ్చింది. దాని తర్వాత తమ రిలేషన్‌పై ఇద్దరూ ఓపెన్ అయిపోయారు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో తాము లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నామని బహిరంగంగానే ప్రకటించారు. తొందరలోనే పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు. ఈ విషయం ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది. ఇదంతా పక్కనబెడితే ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయనకు మాధురి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చింది.
తాజాగా దువ్వాడ శ్రీనివాస్ తన అనుచరులు, సన్నిహితుల మధ్యలో బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దివ్వెల మాధురి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఒక ఖరీదైన వాచీని కొని దువ్వాడకు ప్రేమ కానుకగా అందజేసింది. దీనికి సంబంధించిన వీడియోను మాధురి సోషల్‌మీడియాలో పోస్టు చేసింది. ఇది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దువ్వాడకు ప్రజెంట్ చేసిన వాచీ స్విట్జర్లాండ్‌కు చెందిన రాడో కంపెనీది.. దీని విలువ రూ.2లక్షలకు పైగానే ఉండొచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.