Ram Gopal Varma | సోషల్‌మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అరెస్టు అవుతారా? అనే ఉత్కంఠ కొద్దిరోజులుగా కొనసాగుతోంది. అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారు. ఈ క్రమంలో మీడియా ముందుకొచ్చిన రామ్‌గోపాల్ వర్మ.. తనపై పెట్టిన కేసుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎప్పుడో ఏడాది క్రితం ట్విట్టర్(ఎక్స్)లో పోస్టులు పెట్టాను.. అప్పుడు ఏది పెట్టానో కూడా నాకు నో నాలెడ్జ్. కానీ ఏడాది తర్వాత తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెట్టారని రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. తనపై వివిధ జిల్లాల్లో కేసులు పెట్టారని తెలిపిన ఆర్జీవీ.. ఏడాది తర్వాత ఒకేసారి నలుగురు మేల్కొనడం ఏంటో అర్థం కావడం లేదని విమర్శించారు. తనపై అరెస్టు వారెంటు జారీ కాలేదని రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. పోలీసులు అరెస్టు చేయడానికి హైదరాబాద్ రాలేదని పేర్కొన్నారు. పోలీసులు వస్తే గోడ దూకి పారిపోలేదని చెప్పుకొచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం పంపించానని తెలిపారు. పనికారణంగా కోర్టుకు హాజరుకాలేనని విజ్ఞప్తి చేశానని కూడా చెప్పారు.
అరెస్టుకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లారని వచ్చిన వార్తలపైనా ఆర్జీవీ స్పందించారు. తాను ఎక్కడా దాక్కోలేదని.. పారపోలేదని.. హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఒకవేళ పోలీసులు వచ్చి అరెస్టు చేసినా మంచిదే అని అన్నారు. జైలుకు వెళ్లి నాలుగు స్టోరీలు రాసుకుంటానని చెప్పుకొచ్చారు.