Diarrhea | జగ్గయ్యపేటలో విజృంభిస్తున్న డయేరియా.. చికెన్, మటన్ అమ్మకాలు నిషేధం
Diarrhea | ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభిస్తోంది. అతిసార కారణంగా వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో ఇప్పటికే ఇద్దరు మరణించారు. మరో 35 మంది తీవ్ర అస్వస్థతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Diarrhea | ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభిస్తోంది. అతిసార కారణంగా వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో ఇప్పటికే ఇద్దరు మరణించారు. మరో 35 మంది తీవ్ర అస్వస్థతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక్క జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఇప్పటికే 50కి పైగా ఓపీ డయేరియా లక్షణాలు ఉన్న రోగులు ఉండగా.. ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్న ప్రజలు భయాందోళనల్లో మునిగిపోయారు.
డయేరియా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వాస్పత్రిలో 40 బెడ్లతో ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్, జేసీలు జగ్గయ్యపేటలోనే మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాగా, జగ్గయ్యపేటలో రెండ్రోజుల పాటు చికెన్, మటన్, చేపల అమ్మకంపై నిషేధం విధించారు.
ప్రజలు అవగాహనతో ఉండాలి : మంత్రి సత్యకుమార్
డయేరియా వ్యాప్తి నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జగ్గయ్యపేటలో పర్యటించారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జగ్గయ్యపేటలో మొత్తం 8 గ్రామాల్లో డయేరియా కేసులు విస్తరిస్తున్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇప్పటివరకు అధికారికంగా 58 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. డయేరియా కట్టడిపై అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నామని చెప్పారు. నీటి సమస్య కారణంగా డయేరియా విస్తరిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని అన్నారు. కాబట్టి ప్రజలు అవగాహనతో ఉండాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు.
కాచి చల్లార్చిన నీటినే తాగాలి : హెల్త్ స్పెషల్ సీఎస్
8 చోట్ల డయేరియా కేసులు బయటపడ్డాయని హెల్త్ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు తెలిపారు. ఒక్కో జిల్లాలో ఆరేడు గ్రామాల్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ప్రాథమికంగా నీటిలో సమస్యలు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. నీటిలో క్లోరిన్ శాతాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. దీనిపై పంచాయతీరాజ్ సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలిచ్చామని.. ప్రతి గ్రామంలో హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నారని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

