Pithapuram | కర్పూరం వెలిగించి, హుండీలో వేసిన భక్తురాలు.. ఆలయంలో అలుముకున్న పొగలు!
Pithapuram | ఓ భక్తురాలి అత్యుత్సాహం పెను ప్రమాదానికి కారణమయ్యేది. కార్తీక మాసంలో పూజలు చేసేందుకు ఆలయానికి వెళ్లిన ఓ మహిళ అతి భక్తితో కర్పూరాన్ని వెలిగించి హుండీలో వేసింది. దీంతో హుండీలో ఉన్న కరెన్సీ నోట్లకు నిప్పు అంటుకుని.. ఆలయమంతా పొగలు వ్యాపించాయి.
Pithapuram | ఓ భక్తురాలి అత్యుత్సాహం పెను ప్రమాదానికి కారణమయ్యేది. కార్తీక మాసంలో పూజలు చేసేందుకు ఆలయానికి వెళ్లిన ఓ మహిళ అతి భక్తితో కర్పూరాన్ని వెలిగించి హుండీలో వేసింది. దీంతో హుండీలో ఉన్న కరెన్సీ నోట్లకు నిప్పు అంటుకుని.. ఆలయమంతా పొగలు వ్యాపించాయి. ఆలయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం ఆలయంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.
కార్తీక మాసం శనివారం కావడంతో నిన్న పిఠాపురంలోని శృంగార వల్లభస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కాకినాడ జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ క్రమరంలో ఆలయానికి వచ్చిన ఓ మహిళ అతి భక్తితో కర్పూరం వెలిగించి, స్వామివారి హుండీలో వేసింది. దీంతో హుండీలో ఉన్న కరెన్సీ నోట్లకు నిప్పు అంటుకుంది. నోట్లు అంటుకోవడంతో కొద్దిసేపటికే హుండీ నుంచే పొగలు రావడం మొదలయ్యాయి. ఆలయంలో పొగలు అలుముకుంటూ ఉండటంతో ఆలయ సిబ్బంది గమనించారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే హుండీలో నీళ్లు పోసి మంటలు ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
మంటలు ఆర్పేందుకు నీళ్లు పోయడంతో హుండీ లోపల ఉన్న నోట్లు అన్నీ తడిచిపోయాయి. దీంతో ఆలయ సిబ్బంది తడిచి నోట్లను జాగ్రత్తగా పొడి బట్టతో తుడిచి ఆలయ ఆవరణలో ఎండబెట్టారు. అంతేకాకుండా హెయిర్ డ్రయ్యర్ తీసుకొచ్చి తడిచిన నోట్లను ఆరబెట్టారు. కాగా, అగ్ని ప్రమాదంలో నోట్లు చాలావరకు కాలిపోయినట్లుగా గుర్తించారు. అనంతరం అగ్ని ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించేందుకు ఆలయ సిబ్బంది వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ భక్తురాలు హుండీలో వెలుగుతున్న కర్పూరాన్ని వేయడాన్ని వారు గుర్తించారు. కాలిపోయిన డబ్బును భక్తురాలి వద్ద నుంచి రికవరీ చేస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు.
Temple staff at Sripada Srivallabha Mahasamsthanam in Andhra Pradesh’s Pithapuram had a very tedious day after a devotee allegedly put burning camphor in the donation box, immediately setting the notes on fire. pic.twitter.com/ExBdmuYi1L
— The Siasat Daily (@TheSiasatDaily) November 9, 2025
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

