అమరావతి : ఏపీలో నంది అవార్డులు(Nandi awards), నంది ఉత్సవాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఏపీ సినిమాటోగ్రఫి, టూరిజంశాఖ మంత్రి కందుల దుర్గేష్ (AP Minister Durgesh) తెలిపారు. గురువారం రాజమహేంద్రవరంలో ఎంపీ పురందదేశ్వరితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు.
ఈనెల27న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అవార్డులు అందజేయనున్నామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. గోదావరి జిల్లాలను కలుపుకుని ఆఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టును తయారు చేస్తున్నామని. అరకు, లంబసింగి, బొర్రా గుహల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 15 హరిత టూరిజం కేంద్రాలను మెరుగుపరుస్తున్నామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు వల్ల పర్యాటకం బాగా దెబ్బతిందని తెలిపారు.