సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు చేదు అనుభవం ఎదురైంది. తాను పాల్గొనే సభలో తన పార్టీనే అవమానిస్తే తాను ఉండనంటూ మధ్యలోనే వెళ్లిపోయారు. సమావేశానికి తనను ఆహ్వానించి, తిట్టడం సరైన పద్ధతా? అంటూ ప్రశ్నించారు. రాయలసీమ ధర్మ దీక్ష కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో రాయల సీమకు చెందిన వివిధ ప్రజా సంఘాల నేతలు ఆయనకు అడ్డు తగిలారు. అమరావతి రైతులకు మద్దతిస్తూనే, రాయలసీమ ఉద్యమానికి కూడా ఎలా మద్దతిస్తారు? అంటూ మధును నిలదీశారు. దీంతో సభలో కాసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. కొద్ది సేపటి తర్వాత ఇరువురికీ ఇతర నేతలు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.