కరోనా భయం.. ఉరేసుకొని దంపతుల ఆత్మహత్య
దంపతుల ఆత్మహత్య | కొవిడ్ సోకిందన్న భయంతో తీవ్ర మనస్తాపానికి గురై దంపతులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెడన గ్రామంలో గురువారం రాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

అమరావతి : కరోనా భయంతో తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కొవిడ్ సోకిందన్న భయంతో తీవ్ర మనస్తాపానికి గురై దంపతులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెడన గ్రామంలో గురువారం రాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన లీలాప్రసాద్ (40), భారతి (38) ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తమకు కరోనా సోకిందన్న భయంతో నాటి నుంచి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కొవిడ్ వచ్చినా సకాలంలో చికిత్స తీసుకుంటే చనిపోయేంత ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నా.. కొందరు అనవసర భయం, తొందరపాటుతో తనువు చాలిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

