ఏపీలో ప్రేమోన్మాది దారుణం
ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో దారుణం జరిగింది. రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిపై శనివారం ఉదయం సుమారు 10.30 గంటలకు ఓ ప్రేమోన్మాది ఎలక్ట్రిక్ రంపం(చైన్సా) మిషన్‌తో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది.
- పదో తరగతి విద్యార్థినిపై రంపంతో స్కూల్లో దాడి
- కొన్ని గంటలకే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో దారుణం జరిగింది. రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిపై శనివారం ఉదయం సుమారు 10.30 గంటలకు ఓ ప్రేమోన్మాది ఎలక్ట్రిక్ రంపం(చైన్సా) మిషన్‌తో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది. వెంటనే అప్రమత్తమైన విద్యార్థులు, ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇచ్చి బాలికను సర్వజన దవాఖానకు, గాయపడిన మరో విద్యార్థిని బెంగళూరుకు తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని ధర్మవరం రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన ఉన్మాదిని హేమంత్గా గుర్తించారు. ధర్మవరం మండలం నాగలూరికి చెందిన హేమంత్ తల్లిదండ్రులు చనిపోవడంతో కొన్నాళ్లుగా అయ్యవారిపల్లెలో అక్క దగ్గరే ఉంటున్నాడు. కొద్దిరోజులుగా విద్యార్థిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే విద్యార్థిని ప్రేమను నిరాకరించడంతో హేమంత్ దాడి చేసినట్టు తెలుస్తున్నది. కాగా, నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. రాప్తాడు ప్రభుత్వ పాఠశాలకు ఫోరెన్సిక్ బృందం చేరుకుని.. దాడికి వాడిన రంపం మిషన్‌ను స్వాధీనం చేసుకున్నది. పాఠశాలలో భద్రతా ప్రమాణాలు లేవనే కారణంతో హెచ్ఎంను విద్యాశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రాప్తాడు ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఘటనపై పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. కాగా, ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.
16 ఏండ్ల బాలికపై ఇన్స్పెక్టర్ లైంగికదాడి
గోవాలో గత జూలైలో సైబర్ మోసానికి గురైన ఓ 16 ఏండ్ల బాలిక చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసింది. నార్త్ గోవా క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వికాస్ దేకర్ విచారణ పేరుతో బాలికను పలుమార్లు రాత్రి సమయంలో తన ఆఫీసుకు పిలిపించారు. ఆ సమయంలో వికాస్ దేకర్ తనపై రెండుసార్లు ఆయన ఆఫీసులోనే లైంగికదాడి చేశాడని బాలిక ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. వికాస్‌కు ఓ మహిళ సాయం చేసిందని గుర్తించిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

