Chiranjeevi | రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నా.. ఏపీలో కూటమి విజయంపై చిరంజీవి
Chiranjeevi | ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయంపై టాలీవుడ్ మెగాస్టార్, పద్మవిభూషణ్ చిరంజీవి (Chiranjeevi) స్పందించారు.
Chiranjeevi | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 130కిపైగా స్థానాలను గెలుచుకుంది. కూటమి విజయం పట్ల పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
ఇక టాలీవుడ్ మెగాస్టార్, పద్మవిభూషణ్ చిరంజీవి (Chiranjeevi) సైతం కూటమి గెలుపుపై స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న తెదేపా అధినేత చంద్రబాబుకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మహత్తర విజయం.. మీ మీద ప్రజలకున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ గారి మీద ప్రజలు కనబరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను.. !’ అంటూ పోస్టు పెట్టారు.
ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు.👏👏 💐💐 ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2024
డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2024
Also Read..
Rahul Gandhi | పోటీ చేసిన రెండు చోట్లా రాహుల్ ఘన విజయం.. రాయ్‌బరేలీలో సోనియా రికార్డు బద్దలు
Stocks | 4390 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.. ఒక్కరోజే రూ.30 లక్షల కోట్ల మదుపర్ల సంపద హరీ..!
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

