Rahul Gandhi | పోటీ చేసిన రెండు చోట్లా రాహుల్ ఘన విజయం.. రాయ్‌బరేలీలో సోనియా రికార్డు బద్దలు
Rahul Gandhi | లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఘన విజయం సాధించారు.
Rahul Gandhi | లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఘన విజయం సాధించారు. పోటీ చేసిన రెండు చోట్లా అత్యధిక మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. కేరళ రాష్ట్రం వయనాడ్ (Wayanad) నుంచి వరుసగా రెండోసారి లోక్‌సభకు పోటీ చేసిన రాహుల్ భారీ మెజారిటీతో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి యానీ రాజాపై ఏకంగా 3.5 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
ఇక ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే రాయ్‌బరేలీ (RaeBareli)లో సైతం రాహుల్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై 3.8 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే, ఇక్కడ రాహుల్ ఓ సరికొత్త రికార్డును కూడా క్రియేట్ చేశారు. గతంలో తన తల్లి సోనియా గాంధీ (Sonia Gandhi) సాధించిన ఓట్ల కంటే రెండు రెట్లు ఎక్కవ ఓట్లను రాహుల్ సాధించడం విశేషం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసిన సోనియా గాంధీ.. దినేష్ ప్రతాప్ సింగ్‌పై 167,178 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇప్పుడు రాహుల్.. దినేష్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించి తల్లి సోనియా రికార్డును బద్దలు కొట్టారు.
Also Read..
Somireddy | వరుసగా ఐదుసార్లు ఓటమి.. ఎట్టకేలకు 20 ఏండ్ల తర్వాత సోమిరెడ్డిని వరించిన గెలుపు
Pinnelli Defeat | మాచర్లలో ఈవీఎం ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఓటమి
YS Jagan | 61 వేల ఓట్ల ఆధిక్యంతో జగన్ గెలుపు.. గతంతోపోలిస్తే భారీగా తగ్గిన మెజారిటీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

