YS Jagan | 61 వేల ఓట్ల ఆధిక్యంతో జగన్ గెలుపు.. గతంతోపోలిస్తే భారీగా తగ్గిన మెజారిటీ
YS Jagan | ఏపీ అసెంబ్లీ (Ap Elections) ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఖాతా తెరిచింది. పులివెందుల నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి గెలుపొందారు.
YS Jagan | ఏపీ అసెంబ్లీ (Ap Elections) ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఖాతా తెరిచింది. పులివెందుల నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి గెలుపొందారు. 61 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే జగన్‌కు మెజారిటీ భారీగా తగ్గింది. ఏకంగా 30 వేల ఓట్ల మెజారిటీ కోల్పోయారు. గత ఎన్నికల్లో జగన్‌కు 90 వేల ఓట్లకుపైగా మెజారిటీ రాగా, ఇప్పుడు కేవలం 61 వేలు మాత్రమే రావడం గమనార్హం.
మరోవైపు ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయం చవిచూస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 150కిపైగా సీట్లు సాధించిన వైసీపీ ఈసారి 10 సీట్లలోకూడా గెలిచే అవకాశం కనిపించడంలేదు. కీలక నేతలు సహా మంత్రులంతా ఓటమి పాలయ్యారు. ఒక్క పెద్ది రెడ్డి తప్ప అంతా ప్రత్యర్థుల చేతుల్లో ఘోర ఓటమిని చవిచూశారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. వైసీపీ 9 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
Also Read..
Ap Elections | వైసీపీ నేతలకు ఘోర పరాభవం.. వారసులంతా ఓటమే
AP Elections | జగన్‌కు భారీ షాక్.. 8 జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

