Srisailam | కార్తీక మాసంలో ఆర్జిత సేవల్లో మార్పులు.. రద్దీ రోజుల్లో స్పర్శ దర్శనాలు రద్దు
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీని బట్టి ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాల్లో మార్పులు చేర్పులు చేసినట్లు దేవస్థానం ఈఓ పెద్దిరాజు తెలిపారు.
Srisailam | వచ్చే కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని బట్టి ఆర్జితసేవలు, దర్శన విధానాల్లో పలు మార్పులు చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు పేర్కొన్నారు. కార్తీక మాసం అంతా ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర, దక్షిణాది యాత్రికులు వేలాది మందిగా తరలి వస్తున్నారు.
స్వామివారి గర్బాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, వృద్దమల్లికార్జున స్వామివారి బిల్వార్చన అభిషేకాలు పూర్తిగా నిలిపి వేయనున్నట్లు ఈవో పెద్దిరాజు ప్రకటించారు. అలాగే వారాంతపు సెలవులు, ప్రత్యేక పర్వదినాలైన ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో స్పర్శ దర్శనాలు నిలిపివేసి భక్తులందరికీ అలంకార దర్శనాలు మాత్రమే కల్పించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.
సాధారణ రోజుల్లో నాలుగు విడతలుగా ఉండే స్పర్శ దర్శనాల కోసం ఆన్లైన్లో టిక్కెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. srisailadevasthanam.org , గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీశైలం దేవస్థానం అఫిషియల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని సేవా టిక్కెట్లు, స్పర్శదర్శనం టిక్కెట్లను బుకింగ్ చేసుకోవచ్చునని ఆలయ అధికారులు తెలిపారు. అదే విధంగా శ్రీశైల టీవీ ఛానల్ ద్వారా ప్రసారమయ్యే పరోక్షసేవలతోపాటు ప్రత్యక్షంగా పాల్గొనేందుకు రుద్ర, మృత్యుంజయ, చండీ హోమాలను రెండు విడతలుగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి హాజరు
‘ఏఐటీయూసీ పోరాట ఫలితం.. పీవీకే-5 కార్మికులకు సర్ఫేస్ కన్వర్షన్’
Out Side Food | బయటి ఆహారం తక్కువగా తినాలి లేదా పూర్తిగా మానేయాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Rajnath Singh | ముప్పు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. సైన్యానికి రక్షణ మంత్రి పిలుపు
‘గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించే వరకు పోరాటం’
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

