Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Sajjala | స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో కూటమి నాయకులు ఓడిపోతామనే భయంతోనే అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
అమరావతి : స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో కూటమి నాయకులు ఓడిపోతామనే ( Losing elections ) భయంతోనే అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) మండిపడ్డారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీకి ఎన్నికలంటే భయమని ఆరోపించారు. ఏపీలో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. కూటమి దాడులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ముందస్తు కుట్రతోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ పూర్తికాకముందే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింద ని ప్రశ్నించారు. రిజర్వేషన్లు చివరి నిమిషంలో ప్రకటించి, కేవలం 12 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగించే కుట్ర చేశారని, నామినేషన్లకు రోజుకు నాలుగు గంటలే ఇచ్చి, ఆ సమయంలోనూ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో స్వేచ్ఛగా నామినేషన్లు వేసే వాతావరణం లేదని అన్నారు. పులివెందులలో చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారని విమర్శించారు. నామినేషన్ల ప్రక్రియలో అరాచకాలకు పాల్పడుతున్నారని, అన్ని చోట్ల టీడీపీ గూండాలు బరి తెగిస్తు న్నారని , కొన్ని చోట్ల అధికారులు నామినేషన్ల పత్రాలు తీసుకోవడం లేదని వెల్లడించారు.
పుంగనూరు, రాయచోటి, పులివెందులలో అరాచకాలకు పాల్పడ్డారని,. ఈ తరహా పరిస్థితులు చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా జరిగే పరిస్థితి లేదన్నారు. ప్రజలు తమ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారనే భయంతోనే చంద్రబాబు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని , ప్రభుత్వ పనితీరుపై నమ్మకముంటే ప్రతిపక్షాన్ని స్వేచ్ఛగా పోటీ చేయనివ్వాలని డిమాండ్ చేశారు. డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం దురదృష్టకరమని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని అడ్డదారులు తొక్కినా ప్రజల తీర్పును అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

